2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం

రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 04:15 IST

త్వరలో కూటమికి ఒక రూపు
చేరాలో వద్దో కాంగ్రెస్‌ ఇష్టం
అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టీకరణ

కోల్‌కతా: రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందని, 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని, భాజపా ఓటమి తమతోనే సాధ్యమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. తమ కూటమిలో చేరాలో వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. శనివారం ఓ వార్తాసంస్థకు ఆయన వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ, కేసీఆర్‌లు ఈ విషయంలో కృషి చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇది ఒక కొలిక్కి రానుంది. ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాను ఎదుర్కోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ మేం వదులుకోం. 2024 ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తాం’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు