ఫలితాలు వైకాపా పాలనకు చెంపపెట్టు

పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైకాపా పాలనకు చెంపపెట్టు అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న విమర్శించారు.

Published : 19 Mar 2023 04:15 IST

బుద్ధా వెంకన్న

విజయవాడ, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైకాపా పాలనకు చెంపపెట్టు అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడ మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో శనివారం బాణసంచా కాల్చి అధినేత చంద్రబాబు కటౌట్‌పై పూలవర్షం కురిపించారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, కొట్టేటి హనుమంతరావు, కామ దేవరాజు, తుపాకుల రమణమ్మతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... ప్రజలంతా సీఎం జగన్‌ పాలనకు భయపడి ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారన్నారు. 14 నెలలు ముందుగానే ప్రభుత్వానికి ఓటమి బాటలు పడుతున్నాయన్నారు. జూన్‌ తర్వాత విశాఖ నుంచి పాలన అని జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రచారాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైకాపా నాయకులు రూ. వేల కోట్ల విలువ చేసే భూములను కబ్జాలు చేసినందునే ఉత్తరాంధ్ర విద్యావంతులు గుణపాఠం చెప్పారన్నారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ... అమరావతిని చంపేసి విశాఖను రాజధాని అని ప్రకటించిన వైకాపాకు జనం ఓటుతో సమాధానం చెప్పారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు