మీరు చెల్లించాల్సిన బకాయిల్ని వేరే ప్రభుత్వంపై ఎలా వేస్తారు?

ముఖ్యమంత్రి జగన్‌ 2019 మే నెలలో అధికారంలోకి వచ్చే నాటికి ఒక్క రోజు ముందు దరఖాస్తు చేసుకున్న వైద్య బిల్లుల్ని కూడా తన పాలనా కాలం కాదని చెల్లించలేదని..అలాంటిది 2019-24 మధ్య పెండింగ్‌ పెట్టిన ఉద్యోగుల బకాయిల్ని వచ్చే ప్రభుత్వంపై ఎలా వేస్తారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

Published : 19 Mar 2023 04:52 IST

సీఎం జగన్‌కు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ 2019 మే నెలలో అధికారంలోకి వచ్చే నాటికి ఒక్క రోజు ముందు దరఖాస్తు చేసుకున్న వైద్య బిల్లుల్ని కూడా తన పాలనా కాలం కాదని చెల్లించలేదని..అలాంటిది 2019-24 మధ్య పెండింగ్‌ పెట్టిన ఉద్యోగుల బకాయిల్ని వచ్చే ప్రభుత్వంపై ఎలా వేస్తారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రహదారుల అభివృద్ధికంటూ సెస్‌ పేరుతో వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...ఆ నిధుల్ని ఏం చేస్తోంది? వసూలైన మొత్తాన్ని రోడ్ల బాగుకే ఖర్చు పెడుతున్నారా? లేదా ఇతర వాటికి మళ్లిస్తున్నారా? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు