టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వరు?

తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్‌ టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదో చెప్పాలని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Published : 19 Mar 2023 04:52 IST

అసెంబ్లీ వెలుపల తెదేపా ఎమ్మెల్యే నిమ్మల నిరసన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్‌ టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదో చెప్పాలని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘ఎన్టీఆర్‌ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు?’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని అసెంబ్లీ వెలుపల ఉన్న తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ వద్ద గంటపాటు నిల్చొని శనివారం నిరసన వ్యక్తం చేశారు. మధ్యలో వర్షంపడినా నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. ‘‘తెదేపా హయాంలో రాష్ట్రంలో 8 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి, 90 శాతం పనులు పూర్తి చేశాం. జగన్‌ సీఎం అయ్యాక ఈ నాలుగేళ్లలో మిగిలిన పనుల్ని పూర్తి చేయడానికి ఒక్క రూపాయీ ఖర్చు పెట్టలేదు. పైగా చంద్రబాబు కట్టించిన ఇళ్లకు వైకాపా రంగులు వేశారు. పూర్తి చేసిన ఇళ్లు ఇవ్వకపోవడంతో అద్దెలకుంటూ లబ్ధిదారులు ఏటా రూ.2లక్షల వరకు నష్టపోతున్నారు’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు