ప్రజాస్పందనతోనే అధికార పార్టీకి ఎదురుదెబ్బ

శాసనమండలి పట్టభద్రుల స్థానాల్లో తమ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బకు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటే కారణం అనుకుంటే పొరపాటని, ఇది ప్రజాస్పందన ఫలితమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 19 Mar 2023 11:54 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: శాసనమండలి పట్టభద్రుల స్థానాల్లో తమ పార్టీకి తగిలిన ఎదురుదెబ్బకు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటే కారణం అనుకుంటే పొరపాటని, ఇది ప్రజాస్పందన ఫలితమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ఫలితాలు రాష్ట్రంలోని ప్రజల స్పందన. ఇలా తీర్పు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. రెండున్నర ఏళ్లుగా నేను ఈ విషయం చెబుతున్నాను. అక్రమ కేసులతో అరెస్టు చేసి చితకబాదినా నిజం చెప్పడం ఆపలేదు. అధికార పార్టీ పని అయిపోయింది. మా పార్టీ నాయకులు ఓటుకు రూ.5 వేల వరకు పెట్టినా తెదేపా అభ్యర్థులకు సుమారు 50 శాతం ఓట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం వస్తానని చెబితే స్థానిక ప్రజలు వద్దంటూ.. తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిని గెలిపించి సంకేతాలిచ్చారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే సమర్థులైన నాయకులు వెలుగులోకి వస్తారు’ అని ఎంపీ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు