మండలిని కుదిపిన ‘డిక్లరేషన్‌’ అంశం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా తెదేపా మద్దతుతో గెలిచిన రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా శనివారం రాత్రి జరిగిన హైడ్రామా అంశం శాసనమండలిని కుదిపేసింది.

Published : 20 Mar 2023 02:46 IST

వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెదేపా సభ్యులు
తిరస్కరించిన మండలి ఛైర్మన్‌

ఈనాడు, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా తెదేపా మద్దతుతో గెలిచిన రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా శనివారం రాత్రి జరిగిన హైడ్రామా అంశం శాసనమండలిని కుదిపేసింది. తెదేపా సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. వారికి పీడీఎఫ్‌, భాజపా సభ్యులూ మద్దతు తెలిపారు. గందరగోళ పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాలను కొనసాగించే అవకాశం లేక మండలి ఛైర్మన్‌ మోషేనురాజు సభను వాయిదా వేశారు. ఆదివారం ఉదయం సభ ప్రారంభమవగానే ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్‌ ఎందుకివ్వరు?’ అనే అంశంపై సభలో చర్చించేందుకు అనుమతించాలని తెదేపా ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది సభకు సంబంధించిన అంశం కాదని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలంటూ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్‌ తిరస్కరించారు. దీనికి నిరసనగా తెదేపా ఎమ్మెల్సీలు  నినదిస్తూ పోడియంలోకి దూసుకొచ్చారు. ‘ఇదేం ప్రజాస్వామ్యం? పిరికిపంద చర్య’ అంటూ నినదించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు