పేపర్ల లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి.. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Published : 20 Mar 2023 04:27 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పేపర్ల లీకేజీ చిన్న విషయమని మంత్రి కేటీఆర్‌ చెప్పడం సరికాదు. అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాలకు వెళ్లి చూస్తే.. ఉద్యోగాలకు యువత ఎలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు పేపర్ల లీకేజీలో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లకు లైడిటెక్టర్‌ పరీక్ష నిర్వహించాలి. ప్రభుత్వ అసమర్థతతో ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది యువతకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే మరో సకల జనుల సమ్మెకు విపక్షాలతో కలిసి వెళ్తాం’’ అని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు