Balineni: పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, దీనిపై తాము సమీక్షించుకుంటామని మాజీమంత్రి, ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated : 20 Mar 2023 08:18 IST

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, దీనిపై తాము సమీక్షించుకుంటామని మాజీమంత్రి, ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్లు ఈ ఎన్నికల్లో అర్థమైందన్నారు. రాష్ట్ర ఓటర్లలో వీరివి  రెండు శాతం మాత్రమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కేవలం మూడు సీట్లు గెలిచిన తెదేపా.. అధికారంలోకి వచ్చినట్లు సంబరాలు చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు