అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు కనువిప్పు కలిగించిన పట్టభద్రులు

అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు.. పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 05:02 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు.. పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే ఉంటుందనే సంగతి ముందుగానే స్పష్టమైందన్నారు. ‘ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు.. వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ‘సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులే దారి చూపారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసిన వైకాపా పాలనను తమ ఓటు ద్వారా నిరసించారు’ అని పేర్కొన్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, విజేతలకు అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని