Payyavula: ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయి: పయ్యావుల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పులివెందుల నుంచి తెదేపా ఎమ్మెల్సీ గెలిచారని త్వరలో ఎమ్మెల్యే కూడా తెదేపా నుంచే గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నిఘంటువులోనే లేని ప్రజలు, ప్రజాసామ్యం అనే పదాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలుకుతుంటే విడ్డూరంగా ఉందని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన ఒక్క షాకుతో ఆయనకు అధికారంలో ఉన్నామా అనే అనుమానం రావడం శుభ పరిణామమేనని వ్యాఖ్యానించారు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్‌పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్టు చేయడం వరకు చట్టాన్ని బుల్డోజ్ చేశారని పయ్యావుల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారని మండిపడ్డారు. ‘ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా మా సంఖ్యా బలం 23. మా ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెదేపా బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
Movies News
Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!