కాంగ్రెస్‌ లేకుండా భాజపాను ఎదుర్కోవడం అసాధ్యం.. జైరాం రమేశ్‌ వ్యాఖ్య

తమ పార్టీలేని ప్రతిపక్ష కూటమి భాజపాను ఎదుర్కోవడం అసాధ్యమని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. 2024 ఎన్నికలకు ఏదైనా కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్‌ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.

Published : 20 Mar 2023 04:10 IST

దిల్లీ: తమ పార్టీలేని ప్రతిపక్ష కూటమి భాజపాను ఎదుర్కోవడం అసాధ్యమని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. 2024 ఎన్నికలకు ఏదైనా కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్‌ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ అంశంపై మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందన్నారు. తమ దృష్టి అంతా రాబోయే కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలపైనే ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లకు తాము సమదూరం పాటిస్తామని అఖిలేశ్‌ యాదవ్‌, మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో రమేశ్‌ ఈ మేరకు స్పందించారు. అఖిలేశ్‌, మమతల చర్యలు ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తాయా? అన్న ప్రశ్నకు.. ‘టీఎంసీ, ఎస్పీ నేతలు సమావేశమవుతున్నారు. మూడో ఫ్రంట్‌, నాలుగో ఫ్రంట్‌ ఏర్పాటు కొనసాగుతుంది. అయితే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్‌ తప్పనిసరి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని