పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లను మళ్లీ లెక్కించాలి

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర నేతలు ఆరోపించారు.

Published : 20 Mar 2023 04:35 IST

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నేతల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర నేతలు ఆరోపించారు. ఓట్ల రీకౌంటింగ్‌కు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘లెక్కింపు సమయంలో ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఓట్లను గల్లంతు చేసి.. అధికార పార్టీ అభ్యర్థి గెలుపునకు దోహదపడ్డారనే అనుమానాలున్నాయి. అందుకే కచ్చితంగా రీకౌంటింగ్‌ నిర్వహించాలి. పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించాలి. సీపీఎస్‌ను రద్దు చేయాలి. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలి. బకాయిపడిన రెండు డీఏలను వెంటనే విడుదల చేయాలి. 11వ పీఆర్‌సీ బకాయిలను నెలాఖరులోపు ఉద్యోగుల ఖాతాలకు జమ చేయాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి’ అని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని