భాజపా స్వీయ ప్రయోజనాలకు రాహుల్‌ను హీరోగా చేస్తోంది: మమత

అనేక కీలకాంశాల నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని హీరోగా చిత్రీకరించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు.

Updated : 20 Mar 2023 06:19 IST

కోల్‌కతా: అనేక కీలకాంశాల నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని హీరోగా చిత్రీకరించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. ఆయన లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటును స్తంభింపజేయడం ద్వారా ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఆదివారం బహరంపుర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఫోన్‌ ద్వారా ఆమె మాట్లాడారు.

భవిష్యత్తులో భాజపా ఖతమవుతుంది: అఖిలేశ్‌

రాబోయే రోజుల్లో భాజపా రాజకీయంగా ఖతమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరచిన కాంగ్రెస్‌ నాశనమైందని గుర్తు చేశారు. ఆ పంథానే అనుసరిస్తున్న భాజపాకూ అదే గతి పడుతుందన్నారు. ఆదివారం కోల్‌కతాలో అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని