పోలీసులను పంపి నన్ను భయపెట్టలేరు.. రాహుల్‌ గాంధీ

పోలీసులను పదే పదే పంపడంద్వారా చేసే రాజకీయ దాడులకు తాను భయపడబోనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. చాలాసార్లు పోలీసులు తన ఇంటికి వస్తున్నారని, ఎన్నో కేసులు పెడుతున్నారని, అయినా తనకు సత్యంపైనే నమ్మకముందని, దానినే నమ్ముతానని పేర్కొన్నారు.

Updated : 21 Mar 2023 06:32 IST

 

వయనాడ్‌: పోలీసులను పదే పదే పంపడంద్వారా చేసే రాజకీయ దాడులకు తాను భయపడబోనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. చాలాసార్లు పోలీసులు తన ఇంటికి వస్తున్నారని, ఎన్నో కేసులు పెడుతున్నారని, అయినా తనకు సత్యంపైనే నమ్మకముందని, దానినే నమ్ముతానని పేర్కొన్నారు. కేరళలోని కోజికోడ్‌ జిల్లా ముక్కంలో సోమవారం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల తాళాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘చాలామంది ప్రధాని మోదీకి, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, పోలీసులకు భయపడతారు. కానీ నేను భయపడను. అదే వారికి ఇబ్బందిగా ఉంది. నాపై ఎంతగా దాడి చేశారనేది పెద్ద విషయం కాదు. నా ఇంటికి పోలీసులు ఎన్నిసార్లు వచ్చారన్నదీ ముఖ్యం కాదు. నాపై ఎన్ని కేసులు పెట్టారన్నదీ పట్టింపు లేదు. సత్యాన్నే నమ్ముతా. ప్రధాని, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే దేశంలోని వ్యవస్థలపై దాడులకు దిగుతున్నారు. వారు గందరగోళంలో ఉన్నారు. దేశమంటే తామే అనుకుంటున్నారు. అందుకే దాడులకు దిగుతున్నారు. ప్రధాని దేశంలో ఒక పౌరుడు. ఆయనే దేశం కాదు. ప్రధానిని, భాజపాను, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లు కాదు’ అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని