నిరుద్యోగుల కోసం అవసరమైతే సకల జనుల సమ్మె: ప్రవీణ్‌కుమార్‌

30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అవసరమైతే సకల జనుల సమ్మె చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 21 Mar 2023 04:21 IST

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అవసరమైతే సకల జనుల సమ్మె చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వారికి అన్యాయం చేసినవారిని వదలబోమని హెచ్చరించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలని, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో నిర్వహించిన నిరుద్యోగులకు భరోసా సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి.. సీబీఐ విచారణ కోరాలన్నారు. అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించే వరకు ఉచిత శిక్షణ, నష్టపరిహారంతోపాటు పౌష్టికాహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. 2016లో నిర్వహించిన పరీక్షల్లోనూ అవకతవకలు జరిగాయనే అనుమానాలున్నాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని