బేగంపేటలో చంద్రబాబుకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Published : 21 Mar 2023 05:22 IST

బేగంపేట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ నుంచి సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాత్రి 9 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ఏపీలోని 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెదేపా దక్కించుకున్న నేపథ్యంలో ఆయనకు... తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ముప్పిడి గోపాల్‌లతో పాటు మహిళానేత తులసి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలోని వీఐపీ గేటు నుంచి బయటకి వచ్చిన చంద్రబాబు.. కార్యకర్తలకు అభివాదం చేశారు. తనకోసం వేచిఉన్న వారందరినీ పలకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు