Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విందు భేటీ విఫలమైంది. గత శనివారం ఆయన ఏర్పాటుచేసిన విందు సమావేశానికీ పిలిచిన వారిలో ఒక్క ముఖ్యమంత్రీ హాజరు కాలేదు.
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విందు భేటీ విఫలమైంది. గత శనివారం ఆయన ఏర్పాటుచేసిన విందు సమావేశానికీ పిలిచిన వారిలో ఒక్క ముఖ్యమంత్రీ హాజరు కాలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేజ్రీవాల్‌కు మింగుడుపడనిదే. 2024 లోక్‌సభ ఎన్నికల కూటమిపై చర్చించేందుకు రావాలని ఆయన భాజపాయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు. ‘ప్రొగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (జీ8) పేరుతో ఆయన ఈ విందు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఏడుగురు ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. తనతోపాటు మొత్తం 8 మంది భేటీ అవ్వాలనేది కేజ్రీవాల్ ఆలోచనని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు
-
India News
Bridge Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
General News
Hyderabad: తెలంగాణలో కర్ఫ్యూ లేని పాలన .. ఆ ఘనత పోలీసులదే: ఎమ్మెల్సీ కవిత