నాపై నిందలకు జవాబిచ్చే హక్కుంది

పార్లమెంటులో సీనియర్‌ మంత్రులు, అధికారపక్ష సభ్యులు తనపైన నిరాధారమైన, అన్యాయమైన నిందలుమోపారని, వాటికి సమాధానమిచ్చే హక్కు తనకుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

Updated : 22 Mar 2023 05:35 IST

లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వండి
సభాపతికి రాహుల్‌ లేఖ

దిల్లీ: పార్లమెంటులో సీనియర్‌ మంత్రులు, అధికారపక్ష సభ్యులు తనపైన నిరాధారమైన, అన్యాయమైన నిందలుమోపారని, వాటికి సమాధానమిచ్చే హక్కు తనకుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఇందుకుగాను లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వాలని సభాపతి ఓంబిర్లాకు రాసిన లేఖలో కోరారు. పార్లమెంటు నిబంధన 357ను రాహుల్‌ గుర్తు చేస్తూ.. దీని ప్రకారం సభ్యులకు వ్యక్తిగత వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఈ నిబంధన కింద భాజపా ఎంపీ, అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారని తెలిపారు. ‘పార్లమెంటు సంప్రదాయాలు, సహజ న్యాయ సూత్రాలను అనుసరించి ఇప్పుడు అటువంటి అవకాశమే నాకివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులు మూకుమ్మడిగా చేసే ఆరోపణలకు బదులిచ్చే హక్కు ఇవతలి పక్షానికి కూడా ఉంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా తనకు లోక్‌సభలో మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు