రాహుల్‌.. నేటి కాలపు మీర్‌ జాఫర్‌!.. భాజపా నేత సంబిత్‌ పాత్ర విమర్శ

భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్‌ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు.

Updated : 22 Mar 2023 05:30 IST

దిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్‌ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను వంచించిన సైన్యాధికారి మీర్‌ జాఫర్‌తో రాహుల్‌ను పోల్చారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర. ‘లండన్‌ పర్యటన సమయంలో రాహుల్‌ గాంధీ కూడా అచ్చం ఇదే మాదిరిగా వ్యవహరించారు. రాకుమారుడు నవాబు కావాలనుకుంటున్నారు. అందుకే మీర్‌జాఫర్‌ మాదిరిగా విదేశీ శక్తులను భారత్‌కు ఆహ్వానించారు’ అని సంబిత్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు