ప్రజల ఆకాంక్షల్లో నుంచి కాంగ్రెస్‌ పథకాలు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

Published : 22 Mar 2023 05:02 IST

కేరళలో రాహుల్‌ గాంధీ వెల్లడి

వయనాడ్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పటి యూపీఏ ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల ఆధారంగా, వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించాయంటూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉదహరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. పథకాల రూపకల్పనలో బ్యూరోక్రసీ కీలకపాత్ర వహిస్తుందని ఆరోపించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు మోదీ మనసులో పుట్టిందేనని ఎద్దేవా చేశారు. కాల్పెట్ట జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో భేటీలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ తొలుత పరిహసించారని గుర్తుచేస్తూ....కరోనా సమయంలో ప్రజలకు భారీగా ఉపాధి కల్పించడానికి భాజపా ప్రభుత్వం దానిని అమలు చేయకతప్పలేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని