‘స్కిల్‌’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం

‘స్కిల్‌’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

Updated : 22 Mar 2023 09:16 IST

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఈనాడు-విశాఖపట్నం: ‘స్కిల్‌’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈడీ కస్టడీకి పది మందిని అప్పగించారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఇక మిగిలి ఉన్నారని చెప్పారు. ఈ స్కాంలో భాగంగా రెండు టోకెన్లు హైదరాబాద్‌ చేరిపోయాయనే సమాచారం విచారణ సమయంలో దొరికిందని, ఆ టోకెన్లు ఎవరి జేబులోకి వెళ్లాయో త్వరలో తేల్చుతారని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. చంద్రబాబుకు అవినీతిలో నోబెల్‌ ఫ్రైజ్‌, యాక్టింగ్‌లో ఆస్కార్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందినవని, అయినప్పటికీ ఓటమికి కారణాలను సమీక్షించి, వారి మనసులు గెలుచుకుంటామన్నారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఆ రోజు చరిత్ర మళ్లీ తిరగరాస్తామని చెప్పారు. అంత సరదా ఉంటే లోకేశ్‌ను పులివెందులలో పోటీ చేయాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు