నైపుణ్యాభివృద్ధి పేరుతో తెదేపా మోసం

నైపుణ్యాభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు.

Published : 22 Mar 2023 05:28 IST

మంత్రి మేరుగు నాగార్జున

గోరంట్ల (గుంటూరు), న్యూస్‌టుడే: నైపుణ్యాభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇక్కడి వైకాపా కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధిని అడ్డుపెట్టుకుని డొల్ల కంపెనీలు పెట్టి కోట్లు దండుకుందని ఆరోపించారు. ‘విచారణ సంస్థలు చంద్రబాబును నిందితుడిగా చూపుతున్నాయి. అసెంబ్లీలో దీనిపై చర్చిస్తుంటే చంద్రబాబు.. వాళ్ల ఎమ్మెల్యేలతో బీసీ స్పీకర్‌, ఎస్సీ శాసనసభ్యులపై దాడి చేయడం అమానుష చర్య. తద్వారా స్కాంను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు...’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి, వైకాపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి స్కాంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్‌ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు