పీఏసీలో ఖాళీలు భర్తీ చేయండి

ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్‌కు ఆ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మంగళవారం లేఖ రాశారు.

Published : 22 Mar 2023 05:48 IST

సభాపతికి పయ్యావుల కేశవ్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్‌కు ఆ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మంగళవారం లేఖ రాశారు. ‘‘ఛైర్మన్‌ సహా 12మంది సభ్యులతో పీఏసీ ఏర్పాటైంది. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండేవారు. వారిలో కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, విప్‌గా నియమితులయ్యారు. ఎమ్మెల్సీల్లో కొందరు సభ్యులు పదవీవిరమణ చేశారు. దీంతో పీఏసీలో.. శాసనసభ నుంచి 5, మండలి నుంచి 2 ఖాళీలు ఏర్పడ్డాయి. కమిటీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయటానికి ఆటంకం ఏర్పడుతోంది. ఆ ఖాళీలు భర్తీచేయాలని కోరుతూ గతేడాది అక్టోబరు 21న అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. అయినా చేయలేదు. ఇప్పటికైనా ఆ ఖాళీలను భర్తీచేస్తే పూర్తిస్థాయి కమిటీ కార్యకలాపాలను నిర్వహించగలదు’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు