దేవుడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరం: యనమల

నేరగాళ్లకు దేముడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరంగా ఉందని, దొంగే.. ఇతరులను దొంగ దొంగ అన్నట్లుగా జగన్‌రెడ్డి నైజం ఉందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 22 Mar 2023 05:28 IST

ఈనాడు, అమరావతి: నేరగాళ్లకు దేముడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరంగా ఉందని, దొంగే.. ఇతరులను దొంగ దొంగ అన్నట్లుగా జగన్‌రెడ్డి నైజం ఉందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. ‘రాష్ట్రంలో అసలు నేరగాడు ఎవరు? 13 ఛార్జిషీట్లు ఉన్న వ్యక్తి నేరగాడా? ఏ ఛార్జిషీటూ లేని వ్యక్తి నేరాగాడా? రూ.43 వేల కోట్లు దోచేశాడని సీబీఐ చెప్పినోడు నేరగాడా? ఏ మరకా అంటకుండా 14 ఏళ్లు సీఎంగా చేసినవారు నేరగాడా? 16 నెలలు 16 మొట్టికాయలు పడింది ఎవరికి’ అని యనమల ప్రశ్నించారు. ‘ఒంటరిగా పోటీచేసే దమ్ముందా అని సీఎం అనడం జోక్‌’ అని అభిప్రాయపడ్డారు.‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు చూసైనా కనువిప్పులేదు. రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజా తీర్పునకు సిద్ధంగా ఉండండి’ అని యనమల ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు