భారాసలో మహారాష్ట్ర నాయకుల చేరిక

భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బుధవారం మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు భారాసలో చేరారు.

Published : 23 Mar 2023 03:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బుధవారం మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు భారాసలో చేరారు. వారికి కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని కంధార్‌ లోహలో ఈ నెల 26న భారాస బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్న సభలో భారీ చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా భారాసలో చేరిన వారిలో హర్షవర్ధన్‌ జాదవ్‌, సురేశ్‌ గైక్వాడ్‌, యశ్‌పాల్‌ బింగే తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని