kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Updated : 24 Mar 2023 07:11 IST

చంద్రబాబు సమక్షంలో నేడు చేరిక

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తెదేపాలో చేరుతున్నానని, ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి ఆశీర్వదించి మద్దతు తెలపాలని కోరుతూ.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌ చిత్రాలున్న ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. అటు నుంచి తాడేపల్లికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన గిరిధర్‌రెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కొంతకాలంగా వైకాపాకు దూరంగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు