వరుస విజయాలతో తెదేపాలో ధీమా
ఏడాది వ్యవధిలోనే రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల ముందు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తెదేపా వరుసగా అనూహ్య విజయాలు సాధిస్తుంటే.. మరోవైపు అధికార వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
సాధారణ ఎన్నికల ముందు పార్టీకి పెరుగుతున్న నైతిక బలం
ఈనాడు, అమరావతి: ఏడాది వ్యవధిలోనే రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల ముందు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తెదేపా వరుసగా అనూహ్య విజయాలు సాధిస్తుంటే.. మరోవైపు అధికార వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మండలికి జరిగిన ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో తెదేపాకు సాధారణ గెలుపుగా పరిగణించాల్సినవి కూడా వైకాపా వ్యూహాత్మక తప్పిదాలతో ప్రతిపక్షానికి ఘన విజయాలుగా పరిగణన పొందుతున్నాయి. ఇటీవలి వరకు అధికారపక్ష అంగ, అర్థ బలాలు, పోలీసు కేసుల వేధింపుల తాకిడికి తూగలేకపోయిన ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారిగా జూలు విదిల్చినట్లు పైచేయి సాధిస్తోంది. అన్ని వనరులూ ఉన్న అధికార పక్షం.. తెదేపా వ్యూహం ముందు తేలిపోతోంది. శాసనసభ్యుల కోటా శాసనమండలి ఎన్నికల్లో తెదేపాకు ఉన్న బలంతో ఒక స్థానం దక్కే అవకాశముంది. గెలిచిన 23 మందిలో నలుగురు వైకాపా వైపు వెళ్లడంతో గతంలో ఈ కోటా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. ఏడాది వ్యవధిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందాలని చంద్రబాబు భావించారు. దీనికి అనుగుణంగా ప్రణాళిక రచించారు. పార్టీకి మిగిలిన 19 మంది శాసనసభ్యుల్లో ఒకరిద్దరిపై అధికార పార్టీ కన్నేసినా.. వారిని కాపాడుకోగలిగారు. అదనంగా కావాల్సిన నలుగురు ఎమ్మెల్యేల కోసం కొద్దిరోజులుగా పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేరొందిన ఒక ప్రాంతం నుంచే మూడు ఓట్లు లభించినట్లు సమాచారం. నాలుగో ఓటు కూడా మరో కీలక కోస్తా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేదని వినికిడి. ఇలా నాలుగు ఓట్లు లభించటంతో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధ్యమైంది. ఆమె గెలుపును ముందు నుంచీ అంచనా వేస్తున్న తెదేపా... అనారోగ్య సమస్యలతో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను, కుటుంబపరమైన సమస్యతో బుధవారం రాత్రి సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయిన ఎమ్మెల్యేను గురువారం ఓటింగ్‌కి రప్పించటంలో చొరవ చూపింది. ఇలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవటంతోనే విజయం సాధ్యమైంది. అదే సమయంలో వైకాపా ఉన్న బలాన్ని కాపాడుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో అసాధారణంగా 151 మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకోవటంతోపాటు తెదేపా నుంచి నలుగురిని, జనసేన నుంచి ఒకరిని చేర్చుకుని మరింతగా సంఖ్యా బలం పెంచుకుంది. వీరి అండ చూసుకునే మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాల్నీ దక్కించుకోవాలనుకుంది. తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిచే అవకాశమే లేదు కనుక తదుపరి ప్రాధాన్య ఓట్లు ఎలా వేసుకోవాలన్న దానిపై మూడు, నాలుగు విడతలుగా మాక్ పోలింగ్ నిర్వహించింది. కనీసం పది మంది శాసనసభ్యులపై సందేహంతో పార్టీపరంగా క్యాంపులు పెట్టింది. ప్రతి అభ్యర్థికి నిర్దిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేల్ని కేటాయించి... వారు చేజారకుండా చూసేందుకు ఇలాంటి వ్యవహారాల్లో బాగా ఆరితేరిన సీనియర్ మంత్రులు, శాసనసభ్యుల్ని సమన్వయకర్తలుగా నియమించింది. అయినా అనుమానం తీరక పది మందికి పైగా ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇన్ని చేసినా నలుగురు ఫిరాయించేశారు. వీరిలో ఒకరిద్దరి గురించి ముందుగానే అవగాహన ఉన్నప్పటికీ.. మరో ఇద్దరు కూడా చేజారటంతోనే వైకాపా షాక్ తింది. ఫలితాలొచ్చాక అగ్రనేతల మొహాలు మాడిపోయాయి. వరుస ఓటములతో కారణాలు వెతుక్కుంటూ... పరాజయాల్ని విశ్లేషించుకుంటూ వైకాపా అగ్రనేతలు నైరాశ్యానికి లోనవుతున్నారు. ఆరు స్థానాల్ని గెలుచుకున్న వైకాపా కన్నా... ఒక్క స్థానంలో విజయం సాధించిన తెదేపా సంబరాలు చేసుకోవడం పెద్ద విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్‌ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్‌లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!