చట్టసభల గౌరవాన్ని కాపాడేలా గవర్నర్‌ వ్యవహరించాలి: గుత్తా

ప్రజల అవసరాలు తీర్చే విధంగా, చట్టసభల గౌరవాన్ని కాపాడేలా గవర్నర్‌ వ్యవహరించాలని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 24 Mar 2023 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల అవసరాలు తీర్చే విధంగా, చట్టసభల గౌరవాన్ని కాపాడేలా గవర్నర్‌ వ్యవహరించాలని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బిల్లులను పెండింగులో ఉంచడం వల్ల పాలనకు ఆటంకం కలుగుతోందనీ, వాటిలో సవరణలు అవసరమైతే ప్రభుత్వానికి సూచించాలేగానీ, పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. శాసనమండలిలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఘటన ఇద్దరు వ్యక్తుల తప్పిదం. దాన్ని మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరికాదు.  మంత్రి కేటీఆర్‌పై బురదజల్లడం సరికాదు. ఆధిపత్య పోరులో భాగంగానే రేవంత్‌, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తున్నారు. నా కుమారుడు అమిత్‌ ఎక్కడ పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని గుత్తా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని