శ్రీరాముడు హిందువులకే పరిమితం కాదు: ఫరూక్‌

విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడేనని, ఆయన హిందువులకే పరిమితం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

Updated : 24 Mar 2023 06:15 IST

ఉధంపుర్‌: విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడేనని, ఆయన హిందువులకే పరిమితం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భాజపా అధికారం కోసం రాముడిని ఉపయోగించుకుంటోందని, కానీ ఆయన వారికే దేవుడు కాదని పేర్కొన్నారు. పాంథర్స్‌ పార్టీ గురువారం కశ్మీర్‌లోని ఉధంపుర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘భగవాన్‌ రామ్‌ హిందువులకే దేవుడు కాదు. ఆ మైండ్‌సెట్‌ను మార్చుకోండి. ముస్లింలు, క్రిస్టియన్లు, అమెరికన్లు, రష్యన్లు.. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి దేవుడే. తామే రాముడి భక్తులమని చెప్పుకొనే వారికి నిజంగా ఆయనపై ప్రేమ ఉండదు. అధికారం కోసం అలా చెబుతుంటారు’ అని ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు