మోదీకి ఆంధ్రాలోని అవినీతి కనిపించడం లేదా?

ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతి కనిపించడం లేదా?  అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భాజపాకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలపై ఒక తీరుగా.

Published : 24 Mar 2023 04:08 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు   బీవీ రాఘవులు ప్రశ్న
ఆదిలాబాద్‌లో జనచైతన్య యాత్రకు శ్రీకారం

ఈటీవీ-ఆదిలాబాద్‌: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతి కనిపించడం లేదా?  అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భాజపాకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలపై ఒక తీరుగా, ప్రశ్నించే ప్రతిపక్షాలపై మరోలా వ్యవహరిస్తూ విభజించి పాలిస్తోందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్రలో ఒక దాన్ని ఆయన ఆదిలాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అంతకంటే ముందు సీపీఎం ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి డి.మల్లేష్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో కవిత అవినీతికి పాల్పడ్డారా? లేరా? అనేది పక్కనపెడితే ఆమెకు నోటీసులు పంపించారు. దిల్లీలో ఆప్‌ నాయకుడు సిసోదియా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీపీఎం పాలనలోని కేరళలో స్పీకర్‌, మంత్రులకు సైతం ఈడీ, సీబీఐ నోటీసులు, పంపిస్తున్నారు. ఉన్నచోట నుంచి కదలలేని స్థితిలో ఉండే సాయిబాబా లాంటి మేధావులను సైతం కేంద్రం జైల్లో పెడుతోంది. దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వీరయ్య, విజయలక్ష్మి, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, అడ్డి భోజారెడ్డి, గండ్రత్‌ సుజాత, సాజిద్‌ఖాన్‌, ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని