అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు హక్కు వినియోగించుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 04:24 IST

వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు హక్కు వినియోగించుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ఎవరికి ఓటేశానని అడగటం ధర్మం కాదని.. వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటేస్తానని ఇంతకు ముందే మీకు చెప్పా. అదే మాటకు ఇప్పుడు కట్టుబడ్డా. మిగతా వారు ఎలా ఓటేశారో నేను చెప్పలేను’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు