Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు

‘ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ అని.. ఇందులో ఓడిపోతే ఫైనల్స్‌లో స్థానం ఉండబోదని వైకాపా నేతలే అన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వైకాపాకు ఎదురైంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 24 Mar 2023 07:58 IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ అని.. ఇందులో ఓడిపోతే ఫైనల్స్‌లో స్థానం ఉండబోదని వైకాపా నేతలే అన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వైకాపాకు ఎదురైంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో గురువారం రాత్రి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా పడిలేచిన కెరటమని, దేవుడు 23 సంఖ్య తమకు కలిసొచ్చేటట్లు చేశాడని అభిప్రాయపడ్డారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు తెదేపాకు ఆదరణ పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ వైకాపా అభ్యర్థి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి చెందడం ఆ పార్టీకి తీవ్ర ప్రతికూల ఫలితమన్నారు. వైకాపా పతనం ఆరంభమైందని, సీఎం జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ అయిపోయిందనడానికి ఇదే స్పష్టమైన సంకేతమన్నారు.లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుస విజయాలు వస్తున్నాయన్నారు. ఇదే ఊపు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని, ఇక వైకాపా ఇంటికెళ్లడమేనని జోస్యం చెప్పారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు తెదేపా అభ్యర్థి అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించడం ద్వారా ఆ పార్టీ నేతలు సైతం తెదేపా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు