దేశ రాజధానిలో ‘పోస్టర్’ వార్
దేశ రాజధానిలో ఆప్, భాజపా మధ్య పోస్టర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో ఇటీవల పోస్టర్లు వెలిసిన రెండు రోజులకు కేజ్రీవాల్ వ్యతిరేక పోస్టర్లు కనిపించాయి.
దిల్లీ: దేశ రాజధానిలో ఆప్, భాజపా మధ్య పోస్టర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో ఇటీవల పోస్టర్లు వెలిసిన రెండు రోజులకు కేజ్రీవాల్ వ్యతిరేక పోస్టర్లు కనిపించాయి. ‘కేజ్రీవాల్ హఠావో.. దిల్లీ బచావో’ అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ అంటూ దిల్లీలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇటీవల పోస్టర్లు వెలిశాయి. వాటిని తొలగించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా కేజ్రీవాల్ ఫొటోతో కూడిన పోస్టర్లు దిల్లీ వీధుల్లో గురువారం దర్శనమిచ్చాయి. భాజపా నేత మంజిందర్ సింగ్ సిర్సా పేరుతో వీటిని రూపొందించినట్లు సమాచారం.ఈ పోస్టర్ల వ్యవహారంపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. తనను తొలగించాలంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. వాటిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అటువంటి పోస్టర్లు అంటించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు