గ్రూప్‌-1 మెయిన్స్‌ గడువు మరో 3 నెలలు పొడిగించాలి

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష గడువును మరో 3 నెలల పాటు పొడిగించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండు చేశారు.

Published : 24 Mar 2023 05:43 IST

ముఖ్యమంత్రికి తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష గడువును మరో 3 నెలల పాటు పొడిగించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండు చేశారు. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. ‘అధికారంలోకి వస్తే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రతిపక్షనేతగా మీరు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక మరిచిపోయారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకాక, మరో వైపు ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేక యువత నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. నాలుగేళ్ల తర్వాత విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌ సన్నద్ధతకు 90 రోజుల కంటే తక్కువ గడువు ఉంది. పరీక్షకు సిద్ధం కావడానికి 7 పేపర్లు పూర్తి చేయాల్సి ఉండటంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గడువుని అదనంగా మరో 90 రోజుల పెంచాలి’ అని లేఖలో కోరారు. ఈ విషయంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌కు లోకేశ్‌ మరో లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని