YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?

శాసనసభలో పూర్తిస్థాయి బలం ఉంది.. అలాగే శాసనమండలి కూడా పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలి, అన్ని ఎమ్మెల్సీ స్థానాలనూ సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ పెద్దల అత్యాశే ఈ పరాభవాలకు నాంది పలికిందా అంటే అవుననే అంటున్నాయి వైకాపా వర్గాలు.

Updated : 24 Mar 2023 10:39 IST

అమరావతి : శాసనసభలో పూర్తిస్థాయి బలం ఉంది.. అలాగే శాసనమండలి కూడా పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలి, అన్ని ఎమ్మెల్సీ స్థానాలనూ సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ పెద్దల అత్యాశే ఈ పరాభవాలకు నాంది పలికిందా అంటే అవుననే అంటున్నాయి వైకాపా వర్గాలు. ‘ఈ నియంతృత్వ పోకడతోనే గతంలో ఎప్పుడూ పోటీచేయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డాం’ అని వైకాపా ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరాభవంతోనైనా గుణపాఠం నేర్చుకోకుండా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా అన్నీ మాకే కావాలనే ధోరణితో తగిన సంఖ్యా బలం లేకపోయినా, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన సభ్యులను నమ్ముకుని పోటీ చేశారు.

బయట నుంచి మద్దతిచ్చిన వారిని చూసుకుని బరిలోకి దిగితే.. సొంత పార్టీవారే వాత పెట్టారన్న చర్చ జరుగుతోంది. ఈ రెండు ఎన్నికల విషయంలో పోటీపై గానీ, అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికలకు సిద్ధమవడంలో గానీ ఎక్కడా సీనియర్లు, అవగాహన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలనూ విశ్వాసంలోకి తీసుకోకపోవడం పరాభవాలకు దారి తీసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓట్లు ఎలా వేయాలి? ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుంది? ప్రాధాన్యత ఓట్లను ఎలా సాధించుకోవాలి వంటి విషయాలపై ఎమ్మెల్యేలతో చర్చించి ఒక ప్రణాళికను సిద్ధం చేసిన పరిస్థితి లేదంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు