kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ
వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
నెల్లూరు : వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో మధ్యాహ్నం ఆయన ఆ పార్టీలో చేరతారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీగా మంగళగిరికి బయల్దేరారు.
నెల్లూరు నుంచి దాదాపు 300 కార్లతో కోటంరెడ్డి అనుచరులు ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని కస్తూరి గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంగళగిరి వరకు కొనసాగనుంది. గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా మహిళలు ఆయనకు గుమ్మడికాయలతో హారతిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పసుపు కండువాలు కప్పుకోనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు