Ambati Rambabu: ఆ నలుగురిని శాశ్వతంగా బహిష్కరించే అవకాశం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగుకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశం ఉందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.

Updated : 25 Mar 2023 10:01 IST

మంత్రి అంబటి రాంబాబు

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగుకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశం ఉందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తెదేపా ఒక్కో సభ్యునికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయంలో మీడియా పాయింట్‌ వద్ద శుక్రవారం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందన్న అనుమానంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సస్పెండ్‌కు గురైన నలుగురితో అంతకుముందే సీఎం స్వయంగా మాట్లాడారని, రానున్న ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేనని వారికి స్పష్టం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు మాదిరిగా చూస్తాం... చేస్తామని కాకుండా నేరుగా పార్టీ నిర్ణయాన్ని వారితో సీఎం చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని