Bandi Sanjay: బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన సిట్‌..

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు  సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

Updated : 25 Mar 2023 10:52 IST

హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు  సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్‌ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదివరకే సిట్‌ అధికారులు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.

మరోవైపు ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ వద్ద భాజపా చేపట్టనున్న మహాధర్నాలో బండి సంజయ్‌, పార్టీ నేతలు పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు