2024లో రాజకీయ సునామీ.. వైకాపా శాశ్వతంగా డిస్మిస్‌ అవుతుంది : కోటంరెడ్డి

చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వైకాపా నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అన్నారు.

Updated : 25 Mar 2023 13:48 IST

నెల్లూరు: చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వైకాపా నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అన్నారు. కొందరు బహిరంగంగానే బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

‘వైకాపాలో చాలా మంది లోపల ఉడికిపోతున్నారు. మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైకాపా శాశ్వతంగా డిస్మిస్‌ అవుతుంది. రాజకీయ ప్రజా సునామీ రాబోతోంది. నిన్నటి పట్టభద్రుల  ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు’ అని ఆయన అన్నారు.

‘ప్రజా సమస్యలు పరిష్కరించాలని విసిగి వేసారి గట్టిగా మాట్లాడాను. పార్టీకి విధేయుడిగా ఉన్న నాపై నిఘా పెట్టారు. ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారు. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారు. అందుకే రెండు నెలల క్రితమే పార్టీకి దూరమయ్యాను. సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాను’ అని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైకాపా అధిష్ఠానం సస్పెన్షన్‌ వేటు వేసింది. వారిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒకరు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు