Bandi Sanjay : లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి : బండి సంజయ్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద భాజపా దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ : టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద భాజపా దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
‘నిరుద్యోగులు ఆందోళనకు గురి కావొద్దు. ప్రభుత్వం మెడలు వంచే దాకా వదిలే ప్రసక్తే లేదు. ప్రశ్నా పత్రం లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి. నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మహా ధర్నా చేపట్టాం. ఈ రోజు సిట్ అధికారులను నేనే పిలిచి నోటీసులు అందుకున్నాను. ప్రశ్నాపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయమే ఉందని కేటీఆర్ చెప్పారు. ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్టు చేశారో కేటీఆర్ చెప్పాలి. రాష్ట్రంలోని నిరుద్యోగులు నిరాశకు గురికావొద్దు.. భాజపా అధికారంలోకి వస్తుంది.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది’ అని బండి సంజయ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్