భద్రాద్రిపై వివక్ష చూపుతున్న సీఎం కేసీఆర్‌

శ్రీరామచంద్రుడు కొలువైన భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Updated : 26 Mar 2023 06:21 IST

మాజీ ఎంపీ పొంగులేటి

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీరామచంద్రుడు కొలువైన భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. భద్రాచలంలో శనివారం ఆయన వేల మంది అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకువచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ, కేసీఆర్‌ దీన్ని విస్మరించారని ఆరోపించారు. ఓ దఫా ఇక్కడకు వచ్చినప్పుడు రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పినప్పటికీ దాన్ని మరచిపోయారని ధ్వజమెత్తారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన సమయంలో కేసీఆర్‌.. ప్రతి ఒక కుటుంబానికి 2 పడక గదులు ఇస్తామని, కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత వాటి ఊసే మరిచారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున తక్షణమే చెల్లించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని