తెదేపా సభ విజయవంతానికి 12 కమిటీలు

తెదేపా ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ విజయవంతానికి 12 కమిటీలు ఏర్పాటయ్యాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం జరిగింది.

Published : 26 Mar 2023 03:38 IST

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు: కాసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ విజయవంతానికి 12 కమిటీలు ఏర్పాటయ్యాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం జరిగింది. ఈ నెల 29న హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ, సభాప్రాంగణ అలంకరణ, స్టేజి అలంకరణ, నగర అలంకరణ, వాలంటీర్లు, రిఫ్రెష్‌మెంట్‌, జనసమీకరణ, సభానిర్వహణ, ప్రింట్‌-ఎలక్టాన్రిక్‌-సోషల్‌ మీడియా సంబంధాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శన, ప్రాంగణ పర్యవేక్షణ తదితర 12 కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు ఈ సభకు హాజరవుతున్నందున ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జ్ఞానేశ్వర్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు