Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్: ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి

కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చర్చి పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 26 Mar 2023 08:24 IST

కూసుమంచి, న్యూస్‌టుడే: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చర్చి పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మా కమ్యూనిస్టు మిత్రులు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో పాలేరు నియోజకవర్గాన్ని అడుగుతాం.. పోటీ చేస్తామని అంటున్నారు.. కానీ ఇక్కడ కచ్చితంగా పోటీ చేసేది నేనే.. మీ అందరి సహకారంతో గెలిచేదీ నేనే’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలేరులో ‘వార్‌ వన్‌ సైడ్‌’ ఉంటుందని, ఈ విషయంలో అనుమానాలు, అపోహలకు తావులేదని స్పష్టంచేశారు. మీ అందరికీ మంచి చేస్తాననే నమ్మకం ఉండి నచ్చితేనే తనకు ఓటేయాలని కోరారు. తనకంటే ఎవరైనా ఎక్కువ మేలు చేస్తామని వస్తే.. అది నమ్మితే వారికి వేయాలని సూచించారు.  అన్ని కులాలను, మతాలను సమానంగా చూడటమే తన అభిమతమని ఉపేందర్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు