జగన్‌ను ఎదిరిస్తే జీరోలవుతారు

సీఎం జగన్‌ను ఎదిరించిన వారు రాజకీయంగా జీరోలుగానే మిగులుతారని.. వైకాపా నుంచి సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేలనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

Updated : 26 Mar 2023 06:03 IST

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

విజయవాడ, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ను ఎదిరించిన వారు రాజకీయంగా జీరోలుగానే మిగులుతారని.. వైకాపా నుంచి సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేలనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లో శనివారం ఆసరా పథక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి జగన్‌కు ముందు నుంచీ తెలుసని అన్నారు. పూర్వపు న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌ తనపై తరచూ విమర్శలు చేస్తున్నారని, ఆయన ఒకప్పుడు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై కేసులు వేశారని.. ఇప్పుడు తెదేపా తరఫునే వాదిస్తున్నారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు