రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేదు: మంత్రి కాకాణి

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేదని.. వైకాపా టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని నిర్ధారణ అయిన తర్వాతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు.

Updated : 26 Mar 2023 05:38 IST

నెల్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేదని.. వైకాపా టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని నిర్ధారణ అయిన తర్వాతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు చర్యలు తీసుకోవడం సర్వసాధారణమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని