ఎన్టీఆర్‌ శతజయంతి కమిటీని అభినందించిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల కమిటీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఆదివారమిక్కడ ఆయన నివాసంలో కలిసింది.

Published : 27 Mar 2023 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల కమిటీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఆదివారమిక్కడ ఆయన నివాసంలో కలిసింది. జయహో ఎన్టీఆర్‌ అన్న వెబ్‌సైట్‌, శకపురుషుడు ప్రత్యేక సంచికతో పాటు ఎన్టీఆర్‌ ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకువస్తున్నట్లు కమిటీ నేతలు పార్టీ అధినేతకు వివరించారు. పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్‌సైట్‌, శకపురుషుడు సంచికను హైదరాబాదులో విడుదల చేస్తామని కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ గురించి శతజయంతి కమిటీ బాగా కృషి చేస్తోందని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి మద్దతిస్తామన్నారు. ఆయన్ను కలిసిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నేతలు కాట్రగడ్డ ప్రసాద్‌, రవిశంకర్‌, విక్రమ్‌ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు ఉన్నారు.

తెదేపా సభకు కమిటీల ఏర్పాటు: తెదేపా ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలకు ఛైర్మన్లు, సభ్యుల్ని ఆ పార్టీ నియమించింది. నిర్వహణ కమిటీకి మాత్రం అధినేత చంద్రబాబును సంప్రదించి ఖరారు చేయనున్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.

ఛైర్మన్లు; ఆహ్వాన కమిటీ-రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సభా ప్రాంగణ పర్యవేక్షణ- బక్కని నర్సింహులు, కార్యకర్తల సమీకరణ- అరవింద్‌కుమార్‌ గౌడ్‌, సభా ప్రాంగణ అలంకరణ-తిరునగరి జ్యోత్స్న, ప్రధాన సభావేదిక అలంకరణ- కాసాని వీరేశ్‌, నగర అలంకరణ- అలీ మస్కతి, వాలంటీర్ల కమిటీ- పి.జైరామ్‌చందర్‌, రిఫ్రెష్‌మెంట్‌ కమిటీ-ప్రేమ్‌కుమార్‌ జైన్‌, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా కమిటీ- బియ్యని సురేష్‌, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ- చంద్రహాస్‌, ఫొటో ప్రదర్శన కమిటీ- కాట్రగడ్డ ప్రసూన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు