కార్పొరేట్‌ సంస్థల చేతికి దేశ సంపద

దేశంలో శ్రమ జీవులు సృష్టిస్తున్న సంపదను కేంద్రంలోని భాజపా పాలకులు దోచి.. కార్పొరేట్‌ సంస్థలకు పంచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 27 Mar 2023 03:43 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని విమర్శ

కరీంనగర్‌ కలెక్టరేట్‌, భగత్‌నగర్‌- న్యూస్‌టుడే: దేశంలో శ్రమ జీవులు సృష్టిస్తున్న సంపదను కేంద్రంలోని భాజపా పాలకులు దోచి.. కార్పొరేట్‌ సంస్థలకు పంచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘అదానీ, అంబానీ, విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, లలిత్‌మోదీ వంటి వారు దేశ సంపదను కొల్లగొడుతున్నారు. వారందరికీ నాయకుడు నరేంద్రమోదీ’ అని సాంబశివరావు ఆరోపించారు. సమావేశంలో భారత్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్‌సింగ్‌ గోరియా తదితరులు పాల్గొన్నారు.  సాయంత్రం కరీంనగర్‌లో ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్‌ సమావేశంలో  గుల్జార్‌సింగ్‌ గోరియా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతపెట్టిన కేంద్రం పేదల కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నెలల తరబడి ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించడంలేదన్నారు. బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాల మల్లేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలేదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు టి.వెంకట్రాములు, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య, కార్యదర్శి సృజన్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, 32 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు