అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం: కిషన్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 27 Mar 2023 03:42 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. లీకేజీని నిరసిస్తూ ఇటీవల చేపట్టిన ఆందోళనల్లో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న బీజేవైఎం నాయకులను ఆదివారం ఆయన ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట భాజపా నేతలతో కలిసి కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కొలువులపై ఆశతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కష్టపడి, అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివించారని, చివరికి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెలుగుచూడటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆందోళనకు దిగిన భాజపా శ్రేణులను అరెస్టుచేసి వేధించడం తగదన్నారు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేత శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని