రాహుల్‌పై వేటు కాంగ్రెస్‌కు బలమే: చిదంబరం

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుతో తమ పార్టీ మరింత బలోపేతమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు.

Updated : 27 Mar 2023 06:05 IST

కోల్‌కతా: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుతో తమ పార్టీ మరింత బలోపేతమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న చిదంబరం.. కాంగ్రెస్‌ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని ప్రాంతీయ పార్టీలను లోబరచుకునేందుకు ప్రయత్నిస్తోందని భాజపాపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు