ఇలాగైతే పార్లమెంటు, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం సరైన చర్య కాదని ఆ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ ఛైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు.

Published : 27 Mar 2023 03:42 IST

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం సరైన చర్య కాదని ఆ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ ఛైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. ‘ప్రజాప్రతినిధులపై తక్షణమే అనర్హతకు నేను వ్యతిరేకం. అది రాహుల్‌ గాంధీ కానివ్వండి.. లాలు ప్రసాద్‌ యాదవ్‌ కానివ్వండి.. మరే ఇతర ఎంపీ, ఎమ్మెల్యే అయినా సరే. ఒకవైపు కోర్టు తీర్పు వెలువరించడం.. వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించడం.. ఇదంతా సహజ న్యాయానికి విరుద్ధం. ఇది సరైన చర్య కాదు’ అని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతంలో చివరి న్యాయస్థానం శిక్ష విధించనంత వరకూ అనర్హుడిగా ప్రకటించకూడదనే నిబంధన ఉండేది. చివరి కోర్టును చేరుకునే మధ్యలో 20 అంచెలున్నాయి. గతంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌, ఇప్పుడు రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఇలా చేస్తే మొత్తం పార్లమెంటు, అసెంబ్లీలు ఖాళీ అవుతాయి. ఈ విషయంలో రాజకీయ నేతలకు ప్రత్యేక ప్రమాణాలుండాలి’ అని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు